కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో వ్యవసాయ అధికారి కార్యాలయంలో రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రారంభించారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైల్వేకోడూరు నియోజకవర్గంలో దాదాపు 43 వేల రైతు కుటుంబాలకు 23 కోట్ల 74 లక్షల 35 వేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు కొరముట్ల తెలిపారు.
'రైతులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుంది' - కడపలో రైతు భరోసా పథకం వార్తలు
కడప జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు రైతుభరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా... వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Rythu Bharosa Scheme