కేబుల్ ఆపరేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తుంటే... పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ కోసం బాక్సుల కొరత ఉండటంతో కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని తెలిపారు. తమ గోడును ముఖ్యమంత్రికి తెలియజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు అందరూ బుధవారం రాత్రి విజయవాడకు బయలుదేరగా... పోలీసులు అరెస్టు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి బాక్సులను మంజూరు చేయాలని కోరారు.
'సమస్యలు చెప్పేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణం' - కడప తాజా వార్తలు
సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని.. ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
'సమస్యలను తెలియజేసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణం'