కుందూ నది నుంచి 5 టీఎంసీలు వరద నీరు తరలింపుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు .ఇందుకోసం 310 కోట్లు ఖర్చు చేయనున్నారు .దువ్వూరు వద్ద ఇందుకు అవసరమైన భూమిని సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మం సాగర్ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 17 టీఎంసీలు. ఏటా 12 టీఎంసీలు నీరు నిలువరిస్తే జిల్లాలోని కరవు పీడిత ప్రాంతాలు అయిన బద్వేలు ,మైదుకూరు నియోజకవర్గాల్లోని లక్ష్మన్న ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది.
కడప రైతులకు శుభవార్త! - బ్రహ్మం సాగర్ జలాశయం
కడప జిల్లా రైతన్నలకు మంచి రోజులు రాబోతున్నాయి. కడప రైతులకు వరప్రసాదమైన బ్రహ్మం సాగర్ జలాశయానికి ఏటా 12 టీఎంసీలు నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కడప జిల్లా బ్రహ్మం సాగర్ జలాశయం