దిల్లీలో ప్రార్థనలకు వెళ్లినవారు అధికారులకు సహకరించాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా విజ్ఞప్తి చేశారు. వైద్యపరీక్షలు చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. క్వారంటైన్‌లో ఉండేందుకు వారి కుటుంబసభ్యులూ సహకరించాలని సూచించారు. ఒకేరోజు 17 కేసులు చూశాకైనా ముందుకు రావాలని చెప్పారు. తెలంగాణలో ఆరుగురు వ్యక్తులు మరణించారని గుర్తుచేశారు. ఇప్పటికే 626 మందిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచామని వెల్లడించారు. ఇంకా 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అంజాద్ బాషా వివరించారు.
'దిల్లీ వెళ్లొచ్చిన 85 మంది ఆచూకీ తెలియలేదు' - amzad basha latest news
దిల్లీలో ప్రార్థనలకు వెళ్లినవారు ప్రభుత్వానికి సహకరించాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కోరారు. 626 మందిని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచామని వెల్లడించారు. ఇంకా 85 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వివరించారు.
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా