ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం వల్లే బుగ్గవంక ముంపు: అఖిలపక్ష నేతలు

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కడప బుగ్గవంక ప్రవాహం పెరిగి కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి తక్షణం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయాలని నేతలు డిమాండ్ చేశారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే బుగ్గవంక ముంపు
అధికారుల నిర్లక్ష్యం వల్లే బుగ్గవంక ముంపు

By

Published : Dec 4, 2020, 9:29 PM IST

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కడప బుగ్గవంక ప్రవాహం పెరిగి కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. పది కాలనీల్లోని ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడినా... అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. బుగ్గవంకలో ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి తక్షణం రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేయాలని నేతలు డిమాండ్ చేశారు.

2001లో ఇదే తరహా వరదలొచ్చి ప్రజలు సర్వం కోల్పోతే..అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా ఆర్థిక సాయం చేశారని తెదేపా నాయకులు గుర్తు చేశారు. కానీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వం, యంత్రాంగం మాత్రం బాధితుల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆక్షేపించారు. బుగ్గవంక బాధితులకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు నాయకులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details