తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు కడప నగర పాలక కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కరోనాతో మృతి చెందిన ఆనంద్ అనే కార్మికుడికి రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది కార్మికులు కరోనాతో చనిపోయారని.. కరోనా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు అదనపు జీతం ఇవ్వాలని వారు కోరారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన - aituc protest at kadapa
మున్సిపల్ కార్మికులకు పెండింగులో ఉన్న రెండు నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని కడప జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి అన్నారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన