మంత్రి కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు. హిందువులపై కొడాలి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కొడాలి నాని దృష్టిలో జగన్ మాత్రమే దేవుడని దుయ్యబట్టారు. హిందూ దేవాలయాలపై మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ....కడప జిల్లా దేవునికడపలోని వెంకన్న ఆలయం ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమలకు వెళ్లేటప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టడంలో సీఎంకు ఇబ్బందేంటని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు.
'కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది' - భాజాపా ఆదినారాయణ రెడ్డి న్యూస్
మంత్రి కొడాలి నాని స్వామి భక్తి మానుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. కొడాలి వ్యాఖ్యలను నిరసిస్తూ కడప జిల్లా దేవునికడపలోని వెంకన్న ఆలయం ఎదుట ఆయన ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తిరుమలకు వెళ్లేటప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టడంలో సీఎంకు ఇబ్బందేంటని ప్రశ్నించారు.
కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది