ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటిలో తమిళనాడు వాసి హత్య - rayachoti latest news

కడప జిల్లా రాయచోటి పట్టణంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

died person
మరణించిన వ్యక్తి

By

Published : Oct 31, 2020, 2:22 PM IST

కడప జిల్లా రాయచోటిలో హత్య జరిగింది. రాజేంద్ర మురళి(35) అనే వ్యక్తిని దుండగులు బండరాయితో తలపై మోది హతమార్చారు. అతను రక్తపు మడుగులో పడి ఉండటం చూసిన మృతుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్ర మురళి, అతని సోదరుడు రాజేంద్ర ముత్తు తమిళనాడులోని పాకింబుదూర్​కు చెందినవారు. వ్యాపార నిమిత్తం రెండేళ్ల క్రితం రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని రాజుల కాలనీలో నివాసముంటున్నారు. రాత్రి పూట నిద్రిస్తున్న సమయంలో దుండగులు మురళిపై దాడిచేసి చంపేశారు.

మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించామని పోలీసులు పేర్కొన్నారు. వ్యాపార లావాదేవీలలో తలెత్తిన విభేదాలు హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

చీమలమర్రిలో మరణ మృదంగం..!

ABOUT THE AUTHOR

...view details