ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో ఉరి వేసుకొని వ్యక్తి బలవన్మరణం

పుట్టింటి వెళ్లిన భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపం చెందిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.

ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం
ఉరివేసుకొని వ్యక్తి బలవన్మరణం

By

Published : Jun 18, 2021, 11:41 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని రామేశ్వరానికి చెందిన నాగచంద్రుడు.. ప్రొద్దుటూరులోని ఓ బట్టల దుకాణంలో గుమస్తాగా పని చేసేవాడు. అయితే తాగుడుకు బానిసైన నాగచంద్రుడు.. తరచూ భార్యతో గొడవపడి కొట్టేవాడని.. భర్త వేధింపులు భరించలేక భార్య నెల రోజుల క్రితం ఈశ్వర్ రెడ్డి నగర్​లోని తన పుట్టింటికి వెళ్లిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో భార్య పుట్టింటినుంచి రావట్లేదని మనస్తాపం చెందిన నాగచంద్రుడు.. బైపాస్ రోడ్డు సమీపంలోని తోటలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపారు.

ABOUT THE AUTHOR

...view details