అర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న రద్దీ
కడప ఆర్టీసీ బస్టాండ్లో రోజురోజుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు బస్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.
అర్టీసీ బస్సుల్లో పెరుగుతున్నరద్దీ
కడపలో మూడు రోజుల క్రితం బస్సు సర్వీసులను ప్రారంభించగా రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రొద్దుటూరు మినహా మిగిలిన ఏడు డిపోల పరిధిలో 142 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మదనపల్లి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు బస్ సర్వీసులు ఏర్పాటు చేశారు.