ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ గుర్తింపు కార్డుతో ఆర్టీసీలో ప్రయాణం... చివరికి దొరికిపోయాడు - kadapa rtc depot latest news

ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి నకిలీ గుర్తింపు కార్డును తయారు చేసుకున్నాడు. ప్రతి రోజు కడప నుంచి రాజంపేటకు ఐదేళ్లుగా బస్సులో ఉచితంగా ప్రయాణించాడు. ఇదే క్రమంలో గురువారం రాజంపేటకు వెళ్లేందుకు కడప ఆర్టీసీ బస్టాండ్​ రాగా.. పరిశీలించిన గ్రౌండ్​ బుకింగ్​ కండక్టర్లు నకిలీదని తేల్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Breaking News

By

Published : Jul 2, 2020, 3:01 PM IST

నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసి ఆర్టీసీబస్సులో ఉచితంగా ప్రయాణిస్తూ ఓ వ్యక్తి సిబ్బందికి దొరికిపోయాడు. కడపకు చెందిన సంజీవ కుమార్​ రాజంపేట ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్​ క్లర్క్​గా పని చేస్తున్నాడు. ఈయన కడప డిపోకు చెందిన సుబ్రహ్మణ్యం అనే మెకానిక్​ పేరిట నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసుకున్నాడు. ప్రతి రోజు కడప నుంచి రాజంపేటకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో రాజంపేటకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్​కు రాగా... గ్రౌండ్​ బుకింగ్​ కండక్టర్లు గుర్తింపు కార్డును పరిశీలించి నకిలీదని తేల్చారు. గత 5 ఏళ్లుగా ఇలా ప్రయాణిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details