ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్న్లులు వేసినంత మాత్రానా మున్సిపాల్టీ అయిపోతుందా..! - మౌలిక వసతులు

బద్వేలుకు పురపాలిక హోదా దక్కి దశాబ్దంన్నర కాలం అవుతున్న, హాదాకు తగ్గట్టు మౌళిక వసతులేవి ఇక్కడ కనిపించవు. పన్నులు చెల్లింపు సమయంలో మాత్రం మున్సిపాల్టీ కదా..! అని అనుకుంటాం.

అభివృద్ధికి  దూరం

By

Published : Aug 10, 2019, 12:32 PM IST

అభివృద్ధికి దూరం

కడప జిల్లాలోని బద్వేలు ,గుంతపల్లి మడకల వారిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలను కలిపి 2006 బద్వేలు మున్సిపాల్టీని ఏర్పాటు చేశారు. పురపాలిక హోదా వచ్చి ఇప్పటికి దశాబ్దంన్నర గడుస్తున్నా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవస్థలు బాగుపడలేదు. సౌకర్యాల లేమి, నిర్లక్ష్యం నిలువునా కనిపిస్తుంది. ఎక్కడ చూసిన చెత్తా-డ్రైనేజిలతో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది .అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి .చినుకు పడితే చాలు వీధుల్లో నీళ్లు నిలుస్తాయి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది . మున్సిపాల్టీలో 26 వార్డులు కలిగి లక్ష జనాభా ఉంది. తాగునీటి సరఫరా చేసే పైప్ లైన్లు మురుగుకాలువ లోనే దర్శనమిస్తున్నాయి. బ్రహ్మంసాగర్ నుంచి శుద్ధజలం కలుషితం అవుతుంది. విధిలేని పరిస్థితిలో ఈ నీటినే ప్రజలు ఉపయోగిస్తుండటంతో చర్మ రోగాలు వస్తున్నాయి. పన్నులు మోపితే మున్సిపాల్టీ కాదని, సౌకర్యాలు కల్పిస్తేనే హోదా నిలుపుకున్నట్లు అవుతుందని ప్రజలు వాపోతున్నారు.

బైట్
సుబ్బమ్మ బద్వేలు

ఇదీ చదవండి:'స్పందనలో జనసందోహం..రసీదుల కోసమే'

ABOUT THE AUTHOR

...view details