ఇడుపులపాయలో విధులు నిర్వర్తిస్తున్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ గోసాల ప్రభాకర్(49) బుధవారం అకస్మాత్తుగా మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ప్రభాకర్ కొద్ది రోజులుగా సీఎం అతిథిగృహం క్యాంపు కార్యాలయం వద్ద తోటి కానిస్టేబుల్‌తో కలిసి విధులు నిర్వర్తిస్తున్నారు. మృతునికి మధ్నాహ్న సమయంలో ఛాతి నోప్పి రావటంతో చికిత్స కోసం ఇడుపుల్పాయ ట్రిపుల్ఐటీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులను సంప్రదించి మాత్రలు తెచ్చుకొని వసతిగృహంలో నిద్రపోయారు. భోజనం కోసం తోటి కానిస్టేబుళ్లు నిద్ర లేపిన లేవకపోవటంతో.. స్థానిక ఆసుపత్రి తరలించారు. వైద్యలు అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వైఎస్ఆర్ వ్యవసాయ క్షేత్రంలో కానిస్టేబుల్ మృతి - కడప జిల్లా తాజా వార్తలు
కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ అకస్మాత్తుగా మృతి చెందారు.
కానిస్టేబుల్ మృతి