ఈమె పేరు కొండమ్మ. వయసు 64 సంవత్సరాలు. కడప జిల్లా కమలాపురం మండలం అగస్థలింగాయపల్లి గ్రామానికి చెందిన కొండమ్మ..... సుమారు 40 అడుగుల లోతు ఉన్న బావిలో ఎలాంటి బెరుకు లేకుండా గంటల తరబడి విన్యాసాలు చేస్తోంది. ఎలాంటి భయం లేకుండా గంటల తరబడి బావిలో విన్యాసాలు చేయడం.. తనకు చిన్నప్పటి నుంచి అలవాటుగా ఆమె చెబుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు శివారులోని ఓ వ్యవసాయ బావిలో గురువారం సుమారు రెండు గంటలపాటు నీటిలోనే రకరకాల విన్యాసాలు చేసి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీళ్లలో నిటారుగా నిలవడం, వెల్లకిలా పడుకోవడం, బోర్లా పడుకోవడం, కాలు మీద కాలు వేసుకోవడం లాంటి వయసుకు మించిన ప్రదర్శన చేసింది.
సాహసాల బామ్మ.. విన్యాసాలు చూద్దామా! - agasthalingayapalli
కడప జిల్లా జమ్మలమడుగులో 64 ఏళ్ల వృద్ధురాలు చేస్తున్న విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.
వృద్ధురాలి విన్యాసాలు చూదము రారండీ