ఇదీ చూడండి:
ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ట్రావెల్స్ బస్సు.. 25 మందికి గాయాలు - కడప రోడ్డు ప్రమాదంలో 25 మందికి గాయాలు
కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సమీపంలోని కనుమలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును, గుజరాత్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో 25 మంది గాయపడ్డారు. గుజరాత్‌లోని రాజ్కోట్ నుంచి 20 రోజుల కిందట బయలుదేరిన యాత్రికుల బృందం బస్సు తిరుమల వెళ్తూ ప్రమాదానికి గురయ్యింది. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు, మైదుకూరు ఆస్పత్రులకు తరలించారు. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును యాత్రికుల బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ట్రావెల్స్ బస్సు.. 25 మందికి గాయాలు