ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిట్టుబాటు ధర లేక కష్టాల్లో పడ్డాం - eluru

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్​ వద్ద రైతులు దొండపాదుల రైతులు చలో కలెక్టరేట్​ నిర్వహించారు. త్వరితగతిన వారి సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్​ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు.

గిట్టుబాటు ధర లేక కష్టాల్లో పడ్డాం

By

Published : Aug 15, 2019, 6:49 AM IST

ఇటీవల తెగులు దొండకు తెగులు వ్యాపించినందున తీవ్రంగా దెబ్బతిన్నాయని... లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్​ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్​ తెలిపారు. ప్రస్తుత తరుణంలో మార్కెట్లో ధర లేనందున రైతులు ఒడిదొడుకులు ఎదుర్కొన్నామన్నారు. అయినా ఎంతో కొంత ఆశాజనకంగా ఉంటుందని భావించామని, కాని పరిస్థితి తారుమారైందని వాపోయారు. ఇంకా చాలా మంది రైతులకు పొందిన సబ్సిడీ అందలేదన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు కష్టాల్లో ఉన్నారని ఆవేదన తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఉద్యాన పంటల రైతుల సమస్యలు పరిష్కరించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

గిట్టుబాటు ధర లేక కష్టాల్లో పడ్డాం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details