పశ్చిమగోదావరి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ కోసం జిల్లా పరిషత్లో 14 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను ఎంపీడీవో కార్యాలయంలో స్వీకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 జడ్పీటీసీ స్థానాలు, 863 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భీమవరం మున్సిపాలిటీ పరిధిలో నాలుగు పంచాయతీలోని ఆరు ఎంపీటీసీ స్థానాలు, చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని 7 ఎంపీటీసీ స్థానాలు విలీనమైన నేపథ్యంలో.. వాటి ఎన్నికలు నిలుపేస్తున్నట్టు జడ్పీ సీఈవో పులి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 21వ తేదీన పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈవో తెలిపారు.
పశ్చిమగోదావరిలో జడ్పీ, ఎంపీటీసీల నామినేషన్లు ప్రారంభం
ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరుగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
zptc and MPTC nominations begin in West Godavari