ప్రేమను నిరాకరించిందని యువతిపై ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేశాడు. తన స్నేహితులు ఇద్దరితో కలసి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగొప్పులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహతి అనే యువతిపై ముగ్గురు యువకులు దాడి చేసి కత్తితో గొంతు కోశారు. ఈ ఘటనలో మహతి అక్కడక్కడే మృతి చెందింది. దాడి చేసిన యువకుల్లో ఒకర్ని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ది చేశారు. యువకుడు సృహ తప్పి పడిపోయాడు. పోలీసులు యువకున్ని పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్తులకు చిక్కిన యువకుని పేరు కుర్రెల మహేష్ గా పోలీసులు గుర్తించారు. యువకుని వద్ద ఉన్న ఆధార్ వివరాలు హైదరాబాదు చిరునామాతో ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం కృష్ణా జిల్లా మైలవరం చిరునామాతో ఉంది. పరారైన యువకులు ఇద్దరి వివరాలు పోలీసులు తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి యువకున్ని ప్రశ్నిస్తున్నారు. యువకుల దాడిలో మృతి చెందిన మహతి కాకినాడ ఆదిత్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ పరీక్షలు రాసింది. మహతి స్వగ్రామం భీమవరం మండలం బేతంపూడి. మృతురాలు మహతి అమ్మమ్మ గ్రామమైన కాజుగొప్పులో నాలుగేళ్లుగా ఉంటోంది. మహతిని తానే హత్య చేసినట్లు మహేష్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం.
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతుకోసి హత్య - యలమంచిలి మండలం
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజుగోప్పులో ప్రేమను నిరాకరించిందని యువతిపై ప్రేమోన్మాది తన ఇద్దరు స్నేహితులతో కలసి హత్య చేశాడు. ఆమె స్వస్థలం భీమవరం మండలం బేతంపూడి గ్రామంగా పోలీసులు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో యువతి దారుణ హత్య
Last Updated : Apr 28, 2019, 11:35 PM IST