స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థికంగా బాసట కల్పించడానికి ప్రభుత్వం నేటి నుంచి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి సహాయక సంఘాల బ్యాంకు రుణాల మొత్తాన్ని నాలుగు విడతలుగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. నేడు మొదటి విడత మొత్తాన్ని జమ చేస్తున్నారు.
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలో 63,775 స్వయం సహాయక సంఘాల లోని 6,34,934 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. నాలుగేళ్లలో 2464.75 కోట్ల రూపాయలను జమచేయనున్నారు. మొదటి విడతగా 616.19 కోట్లను సహాయ సంఘాల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పశ్చిమగోదావరి జిల్లాలో 63,775 స్వయం సహాయక సంఘాల లోని 6,34,934 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. నాలుగేళ్లలో 2464.75 కోట్ల రూపాయలను జమచేయనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రారంభం