రైసు మిల్లుపై నుంచి జారిపడిన యువకులు... ఒకరు మృతి - dead
దారవరంలోని బియ్యం మిల్లులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కార్మికులు మిల్లుపై నుంచి పడగా.. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరంలో... సూర్య బియ్యం మిల్లు పైనుంచి పడి ఒకరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విజయకుమార్, అప్పారావు అనే కార్మికులు మిల్లులో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మిల్లుపై భాగం నుండి జారి కిందపడ్డారు. వీరిలో విజయ్ కుమార్ చనిపోగా... తీవ్రంగా గాయపడిన అప్పారావును రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయకుమార్ మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి భారీగా చేరుకున్న మృతుడి బంధువులు... మిల్లు యజమాని నిర్లక్ష్యం వల్లే విజయకుమార్ మరణించాడంటూ ఆందోళన చేపట్టారు