పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతంపల్లిలో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం డబ్బుల విషయంలో ఘర్షణలు జరిగాయి. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. పందేల బరులు ఉద్రిక్తంగా మారాయి. యర్రగుంటపల్లి గ్రామానికి చెందిన యువకులు, తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలానికి చెందిన మరో కొంతమంది యువకుల మధ్య పందేం డబ్బులు దగ్గర గొడవ జరిగి... కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చింతంపల్లిలో కోళ్ల బరి.... యువకుల ఢీ - పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఘర్షణల వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి మండలం చింతంపల్లిలో ఘర్షణలు జరిగాయి. కోళ్లపందేల బరిలోనే ఈ ఘటన జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో తెలంగాణ రాష్ట్రంలోని సత్తపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
చింతంపల్లి కోడిపందెలలో యువకుల మధ్య ఘర్షణ