పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డీజే శ్రీనివాస్ అనే యువకుడు భీమవరంలోని వన్‌టౌన్ పరిధిలో ఎస్ఆర్ టెక్నాలజీస్ & కంప్యూటర్ హార్డ్‌వేర్ షాపు నిర్వహిస్తున్నాడు. తాను నిర్వహిస్తున్న షాపులోనే అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే చనిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భీమవరంలో యువకుడి ఆత్మహత్య... ఎందుకంటే..!
భీమవరంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగా చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భీమవరంలో యువకుడు ఆత్మహత్య