ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమ పేరుతో యువతి గొంతు కోసిన యువకుడు.. కోలుకుంటున్నట్లు వైద్యుల వెల్లడి - ap news

Young Man Cut Young Woman Throat: ప్రేమ పేరుతో రెండు నెలలుగా వెంటపడుతున్నాడు. పలుమార్లు యువతి తండ్రి.. ఆ యువకుడిని హెచ్చరించాడు. అయినా బుద్ధి మార్చుకోని అతను.. అర్ధరాత్రి యువతి ఇంటికి వచ్చి.. ఆమె గొంతు కోశాడు. అడ్డువచ్చిన యువతి తల్లీ.. చెల్లిని గాయపరిచాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న యువతి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

Young Man Cut Young Woman Throat
యువతి గొంతు కోసిన యువకుడు

By

Published : Jan 6, 2023, 10:51 AM IST

Updated : Jan 6, 2023, 4:59 PM IST

Young Man Cut Young Woman Throat: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి కోలుకుంటున్నట్లు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. యువతి కుటుంబసభ్యులకు స్వల్ప గాయాలైనట్లు వెల్లడించారు.

తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం కొండ్రుప్రోలులో దారుణం జరిగింది. గత 2 నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్న రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు.. అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి గొంతు కోశాడు. అడ్డొచ్చిన యువతి చెల్లెలు, తల్లిని చాకుతో కోశాడు. ముగ్గురినీ.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. గతంలో యువకుడిని పలుసార్లు యువతి తండ్రి హెచ్చిరించినట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

"గతంలోనూ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అప్పుడు మా నాన్న పెద్దమనుషులతో వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే వినలేదు. గడ్డివాములకు నిప్పంటించి.. గొంతు కోసి పారిపోయాడు". - యువతి సోదరుడు

యువతి గొంతు కోసిన యువకుడు

ఇవీ చదవండి:

Last Updated : Jan 6, 2023, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details