ఏటీఎంలు కార్డులు మార్చి నగదు డ్రా చేస్తున్న యువకుడిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచర్ల గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావుగా పోలీసులు గుర్తించారు. ఇతను ఏటీఎంలకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకునేవాడు. వారి వద్దకు వెళ్లి ఏటీఎంలలో నగదు డ్రా చేసి ఇస్తానంటూ కార్డులు మార్చేవాడు. ఇలా ఏటీఎంల నుంచి పలుమార్లు 2.90 లక్షల రూపాయలు కాజేశాడు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో నిందితుడు మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
సాయం చేస్తానంటూ వచ్చి... సొమ్ము కాజేసేవాడు! - పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు
ఏటీఎంలకు వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న యువకుడిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎంలలో నగదు డ్రా చేసి ఇస్తానంటూ కార్డులు మార్చి సొమ్ము కాజేసేవాడని పోలీసులు వెల్లడించారు.
young man arrested in eluru for commiting atm frauds