ముఖ్యమంత్రి జగన్ హయాంలో శాసనసభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు అన్నారు. ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా కొమరవరంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. పలుచోట్ల మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
సీఎం జగన్ ప్రజల మనిషిగా నిలిచారు: ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రజల మనిషిగా నిలిచిపోయారని తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు కొనియాడారు. ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా కొమరవరంలో పాదయాత్ర నిర్వహించారు.
సీఎం జగన్ ప్రజల మనిషిగా నిలిచారు: తణు ఎమ్మెల్యే
అనంతరం కొమరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేశారు. గర్భిణీలకు సీమంతం వేడుకలు నిర్వహించి, పసుపుకుంకుమలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. జనసేన, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో వైకాపాలో చేరగా.. పార్టీ కండువా కప్పి అందరినీ ఆహ్వానించారు.
ఇదీ చూడండి:నాడు-నేడు.. శుద్ధి జలం అందేదీ ఇంకెన్నడు ?