ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి - west godavari district latest crime news

అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెంలోని ఆర్​ అండ్ బీ అతిథి గృహం సమీపంలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

Woman suspected death
మహిళ అనుమానస్పద మృతి

By

Published : Dec 2, 2020, 10:36 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం ఆర్ అండ్ బీ అతిథి గృహం సమీపంలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. జంగారెడ్డిగూడానికి చెందిన రఫీ ఉన్నీసా బేగం (55) గా ఆమెను పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు ఆరా తీసి కీలక సమాచారాన్ని తెలుసుకున్నారు.

పది నెలల కిందటే రఫీ ఉన్నీసా బేగం భర్త మృతి చెందాడు. నాటి నుంచి తాడేపల్లిగూడెంలోని కూతురు ఉంటున్న దగ్గరే.. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఇద్దరు కుమారులతో కలిసి ఆమె జీవించింది. పెద్ద కుమారుడు, అల్లుడు ఉదయం గమనించేసరిగి.. రఫీ ఉన్నీసా బేగం మంచంపై మృతి చెంది ఉంది. మెడ, తల మీద బలమైన గాయాలు గమనించిన ఇద్దరు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details