మహిళపై లైంగిక వేధింపులు...పశ్చిమగోదావరి జిల్లా డీపీఓపై చర్యలు - పశ్చిమ గోదావరి జిల్లా డీపీఓపై చర్యలు
జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకున్నారు. మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలు నిజమవ్వటంతో మాతృసంస్థకు శ్రీనివాస్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ముత్యాలరాజు ఉత్తర్వులు ఇచ్చారు.
మహిళను లైంగికంగా వేధించారనే ఆరోపణలు నిరూపితం కావటంతో పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథను మాతృశాఖకు సరెండర్ చేశారు. శ్రీనివాస్ విశ్వనాథ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలు నిజమేనని పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఎస్పీ నివేదిక అందించారు. డీపీఓ పై చర్యలు తీసుకోవాలని కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు రావటంతో మాతృసంస్థకు శ్రీనివాస్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ముత్యాలరాజు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో జెడ్పీ సీఈఓ పులి శ్రీనివాస్‌కు డీపీఓ బాధ్యతలు అప్పగించారు.