పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మత్యాల రాజు పర్యటించారు. ఆచంట మండలం అన్నగారి లంక గ్రామంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను పరిశీలించిన ఆయన, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మూడు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల్లోని 5300 కుటుంబాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం తరఫున 25 కిలోల బియ్యం, వంటకు కావాల్సిన సరుకులు, పాలు పంపిణీ చేస్తున్నట్లు మత్యాల రాజు వెల్లడించారు.
ప.గో జిల్లాలో 5300 కుటుంబాలపై వరద ప్రభావం - achanta
గోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామి ఇచ్చారు.
లంక గ్రామాల్లో పర్యటించిన కలెక్టరు