పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు కోవిడ్ టీకా వేయించుకున్నారు. వైరస్ మహమ్మారి బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
'టీకా తీసుకొండి... సురక్షితంగా ఉండండి'
కొవిడ్ బారిన పడకుండా సురక్షితంగా ఉండేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు తెలిపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కొవిడ్ టీకా వేయించుకున్నారు. వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.
కొవిడ్ టీకా తీసుకుంటున్న కలెక్టర్ రేవు ముత్యాల రాజు
మొదటి దశలో హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ చేశారని అన్నారు. ప్రస్తుతం రెండవ దశలో 60 సంవత్సరాలు పైబడిన వారితో పాటు, అర్హులైన ఇతరులకు టీకా ఇస్తామని కలెక్టర్ చెప్పారు. గుర్తించిన ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ సమయంలో విశేష సేవలు అందిస్తున్న ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ శ్రీ రేవు ముత్యాల రాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి పశ్చిమగోదావరి జిల్లాలో పురఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం
TAGGED:
covid vaccin