పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు వరదతో పోటెత్తుతున్నాయి. జిల్లాలోని ఎర్రకాల్వ, కొవ్వాడ, జల్లేరు, తమ్మిలేరు, పొగొండ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎర్రకాల్వ జలాశయం నాలుగు గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల్లేరు జలాశయం రెండు గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దాటికి వచ్చి చేరుతున్న వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
వరదలతో పాటు వర్షాలు.. నిండుగా జలాశయాలు - floods to godavari
వరదలకు తోడు వర్షాల దాటికి జిల్లాలోని జలాశయాలు నిండుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఉన్న పలు జలాశయాలు ఇప్పటికే నిండుకుండలను తలపిస్తున్నాయి. పూర్తిగా నిండటంతో దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
water projects completley filled with flood water
ఇదీ చదవండి
సీఎంకు తెలిసి జరిగి ఉండదు: ఎంపీ రఘురామకృష్ణరాజు