పశ్చిమగోదావరిజిల్లా తణుకు మండలం వేల్పూరు విద్యుత్తు ఉపకేంద్రంలో లైన్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వాసా సత్య తారకేశ్వరరావు ఏసీబీ చేతికి చిక్కారు. 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు. దుకాణసముదాయాన్ని సూపర్ మార్కెట్ గా మార్చి కరెంట్ కెపాసిటీ పెంచటానికి అనుమతి అడిగారు. అందుకు యజమానుల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వటం ఇష్టం లేక.. వారు ఎసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం ఇరవై వేల రూపాయలు లంచం ఇస్తుండగా అధికారులు అకస్మాత్తుగా దాడిచేసి పట్టుకున్నారు. విద్యుత్తులోడును మార్చటానికి అధికమొత్తంలో లంఛం డిమాండు చేయటంతో అధికారులకు ఫిర్యాదు చేసినట్టు దుకాణదారులు తెలిపారు. తారకేశ్వరరావును అదుపులోనికి తీసుకుని ఎసిబి న్యాయస్థానంలో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.
ఏసీబీ వలలో వేల్పూరు విద్యుత్ ఉపకేంద్రం లైన్ఇన్స్పెక్టర్ - money
పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు విద్యుత్ ఉపకేంద్రంలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సత్యతారకేశ్వరరావు అనిశా చేతికి చిక్కారు. ఇరవై వేలు లంఛం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు.
ఏసీబీ