పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరు చెట్టు పైనుంచి పడి మృతి చెందగా.. మరొకరు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి చనిపోయారు. చేబ్రోలు గ్రామం చెందిన తాటి సాయి (23) తన ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టు ఎక్కగా.. ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి - west godavari district updates
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. చెట్టు పైనుంచి పడి ఒకరు.. మరొకరు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మరణించారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి
భీమడోలు మండలం ఆగడాల లంక గ్రామానికి చెందిన మూరు కోటేశ్వరరావు (19), మూరు సత్యనారాయణ ద్విచక్ర వాహనంపై తాడేపల్లిగూడెం వెళ్తుండగా చేబ్రోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కుమారుడు కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి సత్యనారాయణకు తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండీ