పశ్చిమగోదావరి ఏలూరు కొవిడ్‌కేర్ సెంటర్ నుంచి ఇద్దరు రోగులు పరారయ్యారు. పరారైన కరోనా రోగులిద్దరూ జిల్లా జైలు ఖైదీలు. వీరిద్దరికీ కరోనా సోకటంతో కారాగారం నుంచి శనివారం కొవిడ్ కేర్ సెంటర్‌కు అధికారులు తరలించారు. అదను చూసుకుని కొవిడ్ కేర్ కేంద్రం నుంచి ఖైదీలు పారిపోయారు. వీరివురూ పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. పరారైన దొంగల కోసం ఏలూరు పోలీసులు గాలిస్తున్నారు.
కరోనా సోకిన ఇద్దరు ఖైదీలు పరార్ - కరోనా రోగులు పరార్ వార్తలు
కరోనా సాయంతో ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైలు నుంచి వారిని అధికారులు కొవిడ్ కేర్ సెంటర్‌కు తరలించగా తప్పించుకునిపోయారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.
Two patients escaped from covid care Center in Eluru