ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే ఇంట్లో ఇద్దరు మృతి..మరో ఇద్దరికి అస్వస్థత.. కారణమేంటి..? - పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఎలుకల మందు వాసనతోనే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ఒకే ఇంట్లో ఇద్దరు మృతి
ఒకే ఇంట్లో ఇద్దరు మృతి

By

Published : Nov 11, 2021, 10:29 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు గ్రామీణ మండలం ప్రతికోల్లలంకలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాస్టర్​గా పని చేసే వెంకటరత్నం ఇంట్లో పందికొక్కుల బెడద అధికంగా ఉందని.. వాటిని చంపడానికి ఎలుకల మందు తెచ్చి ఇంట్లో ఉంచారు. మందు వాసన ప్రభావంతో అతని ఇంట్లో నలుగురు అస్వస్థతకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వెంకటరత్నం భార్య నాగమణి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురిని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించగా... మార్గమధ్యంలో పెద్ద కొడుకు నాగార్జున మృతి చెందాడు.

తండ్రి వెంకటరత్నం, చిన్న కొడుకు హరీష్ చికిత్స పొందుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం పంపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

తిరుమలలో విరిగిపడ్డ కొండ చరియలు.. కనుమ దారులు మూసివేత

ABOUT THE AUTHOR

...view details