చేపల వేటకెళ్లి ఓ బాలుడు, మరో యువకుడు మృతి చెందారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా గవరవరంలో జరిగింది.
విషాదం: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి - two died in gavaravaram news
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం గవరవరంలో విషాదం జరిగింది. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ బాలుడు, మరో యువకుడు మృతి చెందారు. అప్పటివరకూ ఇంట్లో ఆనందంగా గడిపిన వారు.. విగత జీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గవరవరంలో చేపల వేటకెళ్లి ఇద్దరు మృతి
గ్రామానికి చెందిన కరుటూరి మంగరాజు (21), అక్కల అభి (7) ఇద్దరూ కలిసి మధ్యాహ్న సమయంలో చేపలు పట్టేందుకు చెరువులో దిగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. లోతు ఎక్కువగా ఉండడంతో మృత్యువాత పడ్డారు. స్థానికుల మృతదేహాలను వెలికి తీశారు. వారి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:విత్తన దుకాణాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు