క్షీరారామంలో గోపూజలు.. హాజరైన తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి - ttd Chairman YV Subbareddy attended the Gopujas at Kshiraramam
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గో పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గోపూజలు చేశారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరారామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఆలయం వరకు గుర్రపుబండిపై ఊరేగింపుగా వచ్చారు. మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, చెల్లబోయిన వేణుగోపాల కృష్ణ, నరసాపురం, రాజోలు తణుకు శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, రాపాక వరప్రసాద్, కారుమూరి నాగేశ్వరరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ అధ్యక్షుడు గుబ్బల తమ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: