ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లోని అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, ఏలేశ్వరం, జగ్గంపేట, దేవీపట్నం, మారేడుమిల్లి, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, చింతలపూడి, అరకులోయ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లె, రావికమతం, రోలుగుంట, గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో, చెట్లకింద ఉండవద్దని సూచించింది.
వాతావరణం: ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక - పశ్చిమగోదావరి జిల్లాలో పిడుగు హెచ్చరిక
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, కూలీలు, జీవాల కాపర్లు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది.
ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు పిడుగు హెచ్చరిక