ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్రహారం అశ్లీల నృత్యాల కేసు.. ముగ్గురు పోలీసులు సస్పెన్షన్​

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో అశ్లీల నృత్యాల కేసులో ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అశ్లీల నృత్యాలను అరికట్టడంలో సరైన చర్యలు చేపట్టకపోవడంపై భీమవరం గ్రామీణ సీఐ, పాలకోడేరు ఎస్సై, కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు.

three police officers suspended
ముగ్గురు పోలీసుల సస్పెండ్

By

Published : Feb 24, 2021, 9:16 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో అశ్లీల నృత్యాల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ మోహన రావు ఉత్తర్వులు జారీ చేశారు. అశ్లీల నృత్యాలను అరికట్టడంలో సరైన చర్యలు చేపట్టకపోవడంపై భీమవరం గ్రామీణ సీఐ బి. నాగేశ్వర నాయక్, పాలకోడేరు ఎస్సై ఏఏజీఎస్ మూర్తి, కానిస్టేబుల్ సీహెచ్ శ్రీనివాస్​లను సస్పెండ్ చేశారు.

పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో చేబోలు రామకృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 14న అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. ఈ ఘటనలో అశ్లీల నృత్యాలకు చేయించి, ప్రోత్సహించిన 13 మందిని ఈ నెల 19న పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అశ్లీల నృత్యాల వీడియోలు హల్​చల్ చేశాయి. భీమవరం పట్టణానికి సమీపంలోని ఇటువంటి అశ్లీల నృత్యాలు జరగటంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో సీఐ, ఎస్సై, కానిస్టేబుల్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details