సాగులో నష్టం వచ్చిందని... రైతు బలవన్మరణం - former
నాలుగు సంవత్సరాలుగా పొగాకు సాగులో నష్టాలు వచ్చాయి. అయినా అప్పులు చేసి ఈ ఏడాది పంట వేశాడు. అయినా లాభాలు మాత్రం రాలేదు. మనస్థాపం చెందిన రైతు బలవన్మరణం చేసుకున్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో విషాదం నెలకొంది. జమ్మి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా నాలుగు సంవత్సరాలు పొగాకు సాగులో నష్టాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా పంట సాగు చేసినా పొగాకు అమ్ముడు కాలేదు. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన రైతు సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక రైతులు తెలిపారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలంటూ పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు పరిమి రాంబాబు డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేస్తామని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు.