ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 9, 2021, 9:38 PM IST

ETV Bharat / state

దారుణం: వరుసకు సోదరైన యువతిపై కామాంధుడు లైంగికదాడి

అండగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు. వావి వరసలు మరిచిపోయి వరసకు సోదరి అయ్యే యువతిపై అత్యాచారం చేసి.. ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండల పరిధిలో జరిగింది.

the elder brother of a row who raped a young woman in dendulur zone of west godavari district
చెల్లెని తల్లి చేసిన 'కామాంధ' అన్న

సోదరి వరుసయ్యే యువతిని అత్యాచారం చేసి, గర్భం దాల్చడానికి కారకుడయ్యాడు ఓ ప్రబుద్ధుడు. విషయం బయటకు రావడంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలానికి చెందిన యువతి దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వస్తూ ఉండేది. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ నెలలో అమ్మమ్మ ఇంటిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే గ్రామానికి చెందిన.. వరుసకు సోదరుడయ్యే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.

ఈ క్రమంలో పలుసార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇటీవల బాధిత యువతి నీరసంగా ఉండటం గమనించిన ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతిగా గుర్తించారు. అనంతరం జరిగిన విషయాన్ని బాధిత యువతి తల్లికి చెప్పడంతో.. దెందులూరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కోడిపందాల కోసం జోరుగా ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details