పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవంలోని రజక చెరువులో 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వ్యక్తి ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా? లేక హత్య చేసి పడేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిస్తే తాళ్లపూడి పోలీసులకు సమాచారం అందివ్వాలని ఎస్సై సతీశ్ కోరారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు.
The body of an unidentified man was found in the pond in peddevam village