పశ్చిమగోదావరి జిల్లా జైనవారిగూడెం వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. సరిహద్దుల్లో నిర్వహించిన తనిఖీల్లో మూడు లక్షల విలువ చేసే మద్యం సీసాలు, వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో స్థానిక ఎన్నికల సందర్భంగా మద్యం సరఫరా అవుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు.
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం - telangana liquor seized news
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం జైనవారిగూడెం వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ మద్యం స్వాధీనం