గోదావరి వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. వరద బాధితుల కష్టాలను ప్రభుత్వం వదిలేసిందని...దీంతో వేలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యలమంచిలి మండల పరిధిలోని పలు ముంపు గ్రామాల్లో పర్యటించిన ఆయన... వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం: రామానాయుడు - తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
గోదావరి వరదను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వరద బాధితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
tdp mla nimmala ramanaidu