తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో.. దివంగత బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి క్లబ్ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగీత ప్రపంచానికి బాలు చేసిన సేవలను ఆమె కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పేద కళాకారులకు క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఎస్పీ బాలుకు స్వర్ణ లయన్స్ క్లబ్ నివాళులు - ఎస్పీ బాలుకు తణుకు లయన్స్ క్లబ్ నివాళి
సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి తణుకులోని స్వర్ణ లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘన నివాళులర్పించారు. భారతదేశ సంస్కృతిని... సంగీతం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు.
పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు పంచుతున్న లయన్స్ క్లబ్ సభ్యులు