భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా సామాజిక దూరం పాటిస్తూ పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఉన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని అంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
అంబేడ్కర్‌కు తణుకు ఎమ్మెల్యే నివాళి
అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ఘన నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న తణుకు ఎమ్మెల్యే