Tadepally NIT: తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్‌పై వేటు... అవినీతి ఆరోపణలతో చర్యలు
NIT Director suspended: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావును కేంద్ర విద్యా శాఖ సస్పెండ్ చేసింది. పలు సంస్థల నుంచి లబ్ధి పొందాడని అవినీతి ఆరోపణలు రావడంతో గత ఫిబ్రవరి నెలలో పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
NIT Director suspended: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్.. డైరెక్టర్ సూర్యప్రకాష్ రావును కేంద్ర విద్యాశాఖ సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్పీరావుపై సీబీఐ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఏపీకి చెందిన ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్ ప్రోవైడర్ ఎస్ఎస్ కేటరర్స్ నుంచి సూర్యప్రకాష్ లబ్ధి పొందాడని... నిట్‌లో కీలకమైన స్థానాల్లో ఉద్యోగాల నియామకాల విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో గత ఫిబ్రవరి నెలలో పలు ప్రాంతాల్లో సూర్యప్రకాష్‌కు చెందిన ఇళ్లు...బంధువుల ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే శాఖాపరమైన చర్యల్లో భాగంగా విద్యాశాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది.
ఇదీ చదవండి: పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. మూడు గంటల పాటు గదిలో బాలుడు