ఉపాధి అవకాశాలు లేని మహిళలకు, యువతులకు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహిక అభివృద్ధి సంస్థ, సత్యసాయి సేవా సంస్థలు.. నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పేద, దిగువ, మధ్యతరగతి మహిళలు, యువతులు ఉపాధి పొందేలా.. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో పూర్తి శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణతో పాటు రుణసాయం..
ఏడాది పొడవునా సాగే ఈ శిక్షణా కార్యక్రమాల్లో.. ఒక్కో బ్యాచ్‌కు 40 రోజుల శిక్షణ ఉంటుంది. ఒక్కో బ్యాచ్‌లో 60 మందికి శిక్షణ ఇస్తారు. నేటి కాలానికి తగ్గట్టుగా.. టైలరింగ్‌లో డిజైనింగ్‌లు నేర్పుతున్నారు. శిక్షణ పూర్తయ్యాక ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఈ ధ్రువీకరణ పత్రం సాయంతో.. సంబంధిత బ్యాంకుల నుంచి రుణం పొందేలా చర్యలు చేపట్టారు. శిక్షణా కాలంలోనే టైలరింగ్‌లో పూర్తి నైపుణ్యం అందిస్తామని శిక్షకురాలు చెబుతుండగా.. తమ కాళ్ల మీద నిలబడగలమన్న ధైర్యం వచ్చిందని శిక్షణ పొందిన మహిలలు చెబుతున్నారు.