పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. చివరిరోజు కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సర్వదేవతల శక్తిస్వరూపిణిగా కనకదుర్గాదేవి గుర్తింపు పొందారు. విజయదశమి పర్వదినాన అమ్మవారిని దర్శించుకుంటే సర్వ శక్తులు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. దేవతకు విశేష పూజలు చేసి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థాన పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పాలంగి కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
పశ్చిమగోదావరి జిల్లా పాలంగి గ్రామంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో చివరిరోజు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక అలంకరణలో కనకదుర్గ అమ్మవారు