ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు - భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

భీష్మ ఏకాదశి పర్వదినాన పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

Special arrangements on the occasion of Bhishma Ekadashi
భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు

By

Published : Feb 23, 2021, 9:21 AM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో కేశవస్వామి వారికి భీష్మ ఏకాదశి పర్వదినాలలో కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. మాఘ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభాలు జరుగుతాయని.. భక్తులు నమ్మకం. తణుకుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.


ఇదీ చదవండి:నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details