ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడు హతం.. తండ్రే చంపాడంటున్న సోదరుడు! - కుటుంబ కలహాలతో కొడుకును హత్య చేసిన తండ్రి

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రే.. తన సోదరుడిని హతమార్చాడని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

son-murder
son-murder

By

Published : Feb 3, 2021, 7:19 AM IST

Updated : Feb 3, 2021, 11:46 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో.. ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఇటీవల హతమయ్యాడు. అతనికి తండ్రి రామిరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయంపై.. మృతుడి సోదరుడు సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి రామిరెడ్డే.. ప్రేమ్ కుమార్ ను హతమార్చాడని ఫిర్యాదు చేశారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత రామిరెడ్డి రెండో వివాహం చేసుకుని మొదటి సంతానాన్ని నిర్లక్ష్యం చేశాడని.. ఈ క్రమంలోనే ప్రేమ్ తో గొడవ పడి చంపేశాడని ఫిర్యాదులో సోమిరెడ్డి ఆరోపించారు.

అంతే కాక.. ప్రేమ్ కుమార్ కు కామెర్లు వచ్చాయని అబద్ధం చెప్పి అంత్యక్రియలను సైతం పూర్తి చేశాడని పోలీసులకు సోమిరెడ్డి చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేయించారు. నివేదిక వచ్చాక.. ప్రేమ్ కుమార్ మృతికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.

Last Updated : Feb 3, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details